Nirmal: మంత్రాజం సురేష్‌కు న్యాయవాదుల ఘన సన్మానం!

Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మంత్రాజం సురేష్‌ను స్థానిక న్యాయవాదులు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

RAKESH N, KHANAPUR
Published on: 29 Oct 2026 9:31 PM IST
Nirmal
X

Nirmal: మంత్రాజం సురేష్‌కు న్యాయవాదుల ఘన సన్మానం!

నిర్మల్: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన మంత్రాజం సురేష్ కి శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ఖానాపూర్‌లోని న్యాయవాదుల కార్యాలయం వద్ద జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, స్థానిక న్యాయవాద సోదరులు సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఖానాపూర్ బార్ అసోసియేషన్ కార్యదర్శి పసుల రాజలింగం, గౌరవ న్యాయవాదులు కిషోర్ నాయక్, సిల్వేరి వేణు, మైత్ర రవి, హైకోర్టు న్యాయవాది పరమేశ్వర్ యాదవ్ గుండవేణి తదితరులు పాల్గొన్నారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సురేష్ భవిష్యత్తులో కూడా సమితి అభివృద్ధికి, రాబోయే ఉత్సవాల విజయవంతమైన నిర్వహణకు తన సేవలనందిస్తూ, అందరి సహకారంతో విజయపథంలో ముందుకు సాగాలని న్యాయవాదులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు."

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR