Khanapur: ఖానాపూర్‌లో అరుదైన శ్వేతనాగు: చూసేందుకు తరలిన జనం!
Khanapur: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోడలపంపు గ్రామంలోని సందర్మాట్ కెనాల్ ఒడ్డున చెట్టుపై అరుదైన శ్వేతనాగు కనిపించింది. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చూశారు.
Khanapur: ఖానాపూర్‌లో అరుదైన శ్వేతనాగు: చూసేందుకు తరలిన జనం!
ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని గోడలపంపు గ్రామం సందర్మాట్ కెనాల్ ఒడ్డున గురువారం రాత్రి శ్వేతనాగు ప్రత్యక్షమైంది. కెనాల్ ఒడ్డున ఉన్న చెట్లపై తెల్లటి రంగులో నాగుపాము చుట్టుకుని ఉంది. రాత్రి వేళ లైట్ వెలుగులో మెరుస్తూ కనిపించడంతో ఆ వైపు వెళ్లిన యువకులు గమనించారు.
వెంటనే అప్రమత్తమైన యువకులు జాగ్రత్తగా చెట్టు నుంచి కిందకు దించి, ఎవరికీ హాని కలగకుండా బయటకు వెళ్లగొట్టారు. శ్వేతనాగును చూసేందుకు గ్రామస్తులు తరలివచ్చారు. పంట పొలాలకు సమీపంలో ఉండటంతో అటు వైపు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.




