Nirmal: నిర్మల్ దస్తూరాబాద్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ!

Nirmal: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ పాఠశాలలో అసిస్టెంట్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీ. భోజన నాణ్యత పరిశీలన.

RAKESH N, KHANAPUR
Published on: 9 Oct 2026 4:33 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ దస్తూరాబాద్ పాఠశాలలో ఆకస్మిక తనిఖీ!

Nirmal: దస్తూరాబాద్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను (MPPS) అసిస్టెంట్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి సందర్శించారు. పాఠశాల సందర్శనలో భాగంగా అసిస్టెంట్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి గారు విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను ఆయన నిశితంగా పరిశీలించారు. పిల్లలకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతుందా లేదా అని వంట సిబ్బందిని, ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించాలని ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోట వేణు, ఉపాధ్యాయ బృందం మరియు విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR