Nirmal: ఖానాపూర్ పట్టణంలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన వేడుకలు!
Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు.
Nirmal: ఖానాపూర్ పట్టణంలో అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జన వేడుకలు!
Nirmal: నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో వినాయక నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా ముందుకు సాగుతోంది. సాంప్రదాయ వాయిద్యాలు, యువత నృత్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఖానాపూర్ వీధులన్నీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.
ఈ శోభాయాత్రలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలు మరియు వాయిద్య బృందాలు ఇక్కడికి వచ్చిన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటూ, ప్రత్యేక ఆకర్షణ నిలిచాయి. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.




