Nirmal: వైభవంగా కర్ర గణపతి శోభాయాత్ర - ప్రత్యేక ఆకర్షణగా నృత్యాలు
Nirmal: నిర్మల్‌లో ఘనంగా జరిగిన కర్ర గణపతి శోభాయాత్ర. నిమజ్జనం చేయకుండా ప్రత్యేక నీటి సంప్రదాయంతో మళ్లీ ఆలయానికి చేర్చిన భక్తులు.
Nirmal: వైభవంగా కర్ర గణపతి శోభాయాత్ర - ప్రత్యేక ఆకర్షణగా నృత్యాలు
నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో ప్రతిష్టించిన కర్ర గణపతి శోభాయాత్ర ఘనంగా జరిగింది.
ఆలయంలో కర్ర గణనాథుని ప్రతిష్టించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తొమ్మిది రోజులు పూజల అనంతరం పట్టణ పురవీధుల గుండా శోభయాత్ర నిర్వహించి తిరిగి ఆలయానికి చేరుకొని యధాస్థానంలో ఉంచుతారు.
ప్రతి ఏటా నిమజ్జనం చేయకుండా స్థానిక చెరువు వద్దకు వెళ్లి కొన్ని నీళ్లు చల్లి తిరిగి ఆలయానికి చేరుకోవడం ఆనవాయితీగా వస్తుంది.
ఈ శోభాయాత్రలో చిన్న, పెద్ద తేడా లేకుండా అలరించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.




