Nirmal: గంజాల్ టోల్‌ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సీజ్!

Nirmal: నిర్మల్ జిల్లా గంజాల్ టోల్‌ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో సరైన పత్రాలు లేని ప్రైవేటు ట్రావెల్స్ బస్సును ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 14 Oct 2026 8:43 PM IST
Nirmal
X

Nirmal: గంజాల్ టోల్‌ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు సీజ్!

నిర్మల్: నిర్మల్ జిల్లా గంజాల్ టోల్ ప్లాజా వద్ద సాయంత్రం రవాణా శాఖ అధికారులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ప్రైవేటు బస్సును సీజ్ చేశారు. హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వైపుకు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు సరైన ధ్రువపత్రాలు లేకపోవడంతో బస్సును సీజ్ చేసినట్లు ఆర్టిఏ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా రవాణాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఎంవిఐ లు ధూప్ సింగ్, తిరుపతిలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడిపే ప్రతి ఒక్కరు తమ వద్ద అన్ని ధ్రువపత్రాలు ఉంచుకోవాలని పేర్కొన్నారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడిపితే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంవిఐలు లు రానా శ్రీ, అక్షయ్, రజనీకాంత్, లిఖిత్, రవాణా శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL