Nirmal: ముధోల్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మూడు ఇళ్లలో అగ్నిప్రమాదం
Nirmal: నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని కొలీగల్లీలో షార్ట్ సర్క్యూట్‌తో సంభవించిన అగ్నిప్రమాదంలో మూడు ఇళ్లు దగ్ధమై భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది.
Nirmal: ముధోల్‌లో షార్ట్ సర్క్యూట్‌తో మూడు ఇళ్లలో అగ్నిప్రమాదం
నిర్మల్: నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రంలోని కొలీగల్లీలో షార్ట్ సర్క్యూట్ తో మూడు ఇళ్లలో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక ఇంట్లో నగదు, మరో రెండు ఇండ్లకు ఆర్థిక నష్టం వాటిల్లింది.
కందోల్ల గంగవ్వ, అనిత, జింకొల్ల పండరీకి చెందిన ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఈ ప్రమాదంలో గంగవ్వ ఇంట్లో ఉన్న సుమారు 50 వేల రూపాయల నగదుతో పాటు నిత్యావసర వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. మరో రెండు ఇళ్లకు కూడా ఆర్థిక నష్టం వాటిల్లింది.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. స్థానికులు సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు నష్టం వివరాలను సేకరించారు.




