Nirmal: ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా వరి పంటకు నీరు పడుతున్న రైతు భూమేష్!

Nirmal: నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ రైతు భూమేష్ ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీటిని తెచ్చి వరి పంటను కాపాడుకునేందుకు వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు.

Srinivas, Mondol Bhainsa
Published on: 4 Oct 2026 7:14 PM IST
Nirmal
X

Nirmal: ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా వరి పంటకు నీరు పడుతున్న రైతు భూమేష్!

Nirmal: నిర్మల్ జిల్లా భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భూమేష్ అనే రైతు తన రెండెకరాల వరి పంటను కాపాడుకునేందుకు వినూత్న ప్రయత్నం చేస్తున్నాడు. రోజూ కిలోమీటర్ల దూరం నుంచి ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీటిని తీసుకొచ్చి పొలానికి అందిస్తున్నాడు.

దీని కోసం రైతు భూమేష్ అదనంగా డబ్బులు ఖర్చు చేస్తున్నా కూడా పంట చేతికి వస్తుందో లేదో అనే ఆందోళనలో ఉన్నాడు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో పొలాలు పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రైతు పొలానికి సమీపంలోనే పెద్ద చెరువు ఉన్నప్పటికీ ఆ చెరువు నుంచి కాలువ ద్వారా నీటిని తీసుకోవాలంటే ఇరిగేషన్ అధికారుల అనుమతి కావాలని, అనుమతి ఇవ్వడం లేదని రైతు వాపోతున్నాడు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువు నుంచి కాలువ ద్వారా నీటిని విడుదల చేసి తమతో పాటు గ్రామంలోని ఇతర రైతుల పంటలను కూడా కాపాడాలని రైతు భూమేష్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa