Nirmal: కల్లూరు రైస్ మిల్లులో భారీ ధాన్యం కొరత, మిల్లు సీజ్!
Nirmal: నిర్మల్ జిల్లా కుంటాల మండలం కల్లూరు రైస్ మిల్లులో అధికారుల ఆకస్మిక తనిఖీ. 3,720 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరతతో మిల్లు సీజ్.
Nirmal: కల్లూరు రైస్ మిల్లులో భారీ ధాన్యం కొరత, మిల్లు సీజ్!
Nirmal: కుంటాల మండలంలోని కల్లూరు గ్రామంలో ఓ రైస్ మిల్లు లో రెవెన్యూ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం మిల్లులో 1,11,000 సంచులు (4,440 మెట్రిక్ టన్నులు) ధాన్యం నిల్వ ఉండాల్సి ఉండగా, తనిఖీల్లో కేవలం 18,000 సంచులు (720 మెట్రిక్ టన్నులు) మాత్రమే ఉన్నట్లు గుర్తించారు.దీంతో 93,000 సంచులు (3,720 మెట్రిక్ టన్నుల) ధాన్యం కొరత ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
నిల్వల్లో భారీ వ్యత్యాసం గుర్తించడంతో రైస్ మిల్లును, మిల్లులో ఉన్న లారీలోని ధాన్యాన్ని అధికారులు సీజ్ చేశారు. మిల్లర్ అందుబాటులో లేకపోవడంతో శనివారం నిబంధనల ప్రకారం పంచనామా నిర్వహించనున్నట్లు తెలిపారు.ధాన్యం విషయంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. తనిఖీల్లో తహసీల్దార్ కమల్ సింగ్‌తో పాటు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.




