Basara: బాసర విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలు పంపిణీ చేసిన ట్రస్ట్!
Basara: నిర్మల్ జిల్లా బాసర గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, నాగభూషణ విద్యాలయం విద్యార్థులకు శ్రీ భోస్లే మోహన్రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆల్ ఇన్ వన్ పుస్తకాలు పంపిణీ చేశారు.
Basara: బాసర విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ పుస్తకాలు పంపిణీ చేసిన ట్రస్ట్!
బాసర: ఈరోజు బాసర గ్రామంలోని ZPHS ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరియు బాసర నాగభూషణ విద్యాలయంలో బాలురు మరియు బాలికలకు ఆల్ ఇన్ వన్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యలో ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, విద్యార్థులందరూ చదువులో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే గొప్ప ఆశయంతో ఈ పుస్తకాలను అందించడం జరిగింది.
విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు పెట్టి, వారి కలలకు ప్రోత్సాహాన్ని అందిస్తూ, రేపటి సమాజానికి మంచి పౌరులుగా తీర్చిదిద్దేందుకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు శ్రీ భోస్లే మోహన్రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ గారు. ఆడపిల్ల అయినా, మగపిల్లవాడైనా… ప్రతి ఒక్కరికీ విద్యే నిజమైన బలం. ప్రతి విద్యార్థి విజయం సాధించడమే మన సమాజానికి గర్వకారణం!
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం ఎంతో అభినందనీయం. శ్రీ భోస్లే మోహన్రావు పాటిల్ గారికి మరియు ప్రజా ట్రస్ట్ సభ్యులకు హృదయపూర్వక అభినందనలు.తెలిపిన విద్యార్థులు,ఉపాద్యాయులు.




