Nirmal: రెవెన్యూ అర్జీలు త్వరగా పరిష్కరించాలి: వెంకట మాధవ్ రావు!

Nirmal: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం రేవోజిపేటలో భూ రీ-సర్వే పనులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకట మాధవ్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు ఆదేశాలిచ్చారు.

RAKESH N, KHANAPUR
Published on: 30 Oct 2026 12:32 PM IST
Nirmal
X

Nirmal: రెవెన్యూ అర్జీలు త్వరగా పరిష్కరించాలి: వెంకట మాధవ్ రావు!

నిర్మల్: నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీ వెంకట మాధవ్ రావు ఈరోజు పర్యటించారు. మండలంలోని రేవోజిపేట గ్రామాన్ని సందర్శించిన ఆయన, అక్కడ స్థానికంగా సాగుతున్న భూ రీ-సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే ప్రక్రియ జరుగుతున్న తీరును, రికార్డులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా, దస్తూరాబాద్ మండల పరిధిలోని పలు రెవెన్యూ సమస్యలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. స్థానిక రెవెన్యూ అధికారులు, సిబ్బందితో మాట్లాడి సమస్యల వివరాలను సేకరించారు. ప్రజల నుంచి వచ్చే రెవెన్యూ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR