Nirmal: నిర్మల్ జిల్లాలో మంత్రుల పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష!
Nirmal: నిర్మల్ జిల్లాలో సోమవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
Nirmal: నిర్మల్ జిల్లాలో మంత్రుల పర్యటన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష!
Nirmal: సోమవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇతర ఉన్నతాధికారుల జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
శనివారం సాయంత్రం జిల్లా కలెక్టర్, సోమవారం నాటి మంత్రుల పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులందరూ సంబంధిత నివేదికలతో సిద్ధంగా ఉండాలన్నారు. మంత్రుల పర్యటనకు తగిన ఏర్పాట్లను చేయాలని పేర్కొన్నారు. ఆయా అధికారులకు వివిధ బాధ్యతలను అప్పగించి, పలు కీలక సూచనలు చేశారు. తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించాలని స్పష్టం చేశారు. అధికారులంతా సమయానికి సమావేశానికి హాజరు కావాలని అన్నారు.
ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, ఏఎస్పీ సాయికిరణ్ వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




