Nirmal: ప్రభుత్వ బడుల్లో ప్రతి విద్యార్థిపై శ్రద్ధ పెట్టాలి: కలెక్టర్!
Nirmal: నిర్మల్ జిల్లా ముధోల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు గణితం బోధించి పెన్నులను బహుమతిగా అందించారు.
Nirmal: ప్రభుత్వ బడుల్లో ప్రతి విద్యార్థిపై శ్రద్ధ పెట్టాలి: కలెక్టర్!
నిర్మల్: ప్రభుత్వ బడుల్లో చదివే ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు. ముధోల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మంగళవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పాఠశాల ఆవరణను పరిశీలించిన కలెక్టర్, శిథిలావస్థకు చేరిన భవనాన్ని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. దాని స్థానంలో నూతన అదనపు తరగతుల నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. పాఠశాలకు సంబంధించి విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఐదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు రావాలని సూచించారు. స్నేహితులు ఎవరైనా బడికి రాకపోతే వారిని కూడా తీసుకొని రావాలన్నారు. విద్యార్థులతో లెక్కలు సులభంగా అర్థమయ్యేలా మెలకువలు నేర్పి కొన్ని లెక్కలు చేయించారు. ఇంగ్లీష్ పదాలను వ్యతిరేక క్రమంలో చదివిపించారు. విద్యార్థుల ప్రతిభను మెచ్చుకున్న కలెక్టర్ పలువురికి పెన్నులను బహుమతులుగా ఇచ్చి అభినందించారు. ఉపాధ్యాయుల బోధన, విద్యార్థుల ప్రతిభపై సంతృప్తి వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పేర్కొన్నారు.




