Nirmal: వీబీ-జీ రామ్ జీ పనులను వేగవంతం చేయాలి
Nirmal: లోకేశ్వరం మండలం అర్లి-గొడిసెర్యాల్‌లో నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా పర్యటించారు. వీబీ-జీ రామ్ జీ పనులు, వృక్ష మందిరం స్థలాన్ని పరిశీలించారు.
Nirmal: వీబీ-జీ రామ్ జీ పనులను వేగవంతం చేయాలి
నిర్మల్: వీబీ-జీ రామ్ జీ పనులను సమర్థవంతంగా చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. లోకేశ్వరం మండలం అర్లి-గొడిసెర్యాల్ గ్రామంలో శుక్రవారం కలెక్టర్ పర్యటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వీబీ-జీ రామ్ జీ కింద ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించాలని, జాబ్ కార్డుదారులను పనులకు ప్రోత్సహించాలని సూచించారు. నీటి సంరక్షణ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
అనంతరం గ్రామంలో వృక్ష మందిరం కోసం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. నిబంధనల ప్రకారం స్థల కేటాయింపుపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.




