Nirmal: నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కలెక్టర్ సమీక్షా సమావేశం!

Nirmal: ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మెరుగైన వైద్య విద్య, మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశం; ఆసుపత్రిలో పరికరాల ఏర్పాటుకు సూచన.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 9 Oct 2026 7:39 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కలెక్టర్ సమీక్షా సమావేశం!

Nirmal: ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్థులకు అందిస్తున్న విద్య, మౌలిక సదుపాయాల కల్పన, ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరమైన సదుపాయాల కల్పన, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులకు అవసరమైన ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చినప్పుడే వారి సామర్థ్యాలు పెరుగుతాయని, అలాగే వారు మంచి వైద్యులుగా తీర్చిదిద్దబడతారని పేర్కొన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని వివరించారు.

వైద్య కళాశాలలోని విద్యార్థుల సంఖ్య, వారి విద్యా సంబంధిత విషయాలను అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు నిర్దేశిత పరీక్షలను నిర్వహిస్తూ, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆయా విభాగాల్లో అవసరమైన వైద్య సేవలను అందించేందుకు కావలసిన పరికరాలన్నీ ప్రాధాన్యత క్రమంలో సమకూర్చుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ రాజేందర్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ శారద, ప్రభుత్వ సాధారణ ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, డిసిహెచ్ఓ కాశీనాథ్, ఇతర అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL