Nirmal: సదర్‌మాట్ నుంచి సాగునీరు విడుదల కలెక్టర్‌కు రైతుల కృతజ్ఞతలు!

Nirmal: నిర్మల్ జిల్లా కడం సదర్‌మాట్ నుంచి ఎండిపోతున్న వరి పంటలకు సాగునీరు విడుదల. స్పందించిన కలెక్టర్ అభిలవ్ గుప్తాకు ధన్యవాదాలు తెలిపిన రైతులు.

RAKESH N, KHANAPUR
Updated on: 30 Oct 2026 6:47 AM IST
Nirmal
X

Nirmal: సదర్‌మాట్ నుంచి సాగునీరు విడుదల కలెక్టర్‌కు రైతుల కృతజ్ఞతలు!

నిర్మల్ జిల్లా: కడం మండలం సదర్‌మాట్ నుంచి సాగునీరు అందక ఎండిపోతున్న వరి పంటలకు ఎట్టకేలకు నీరు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ధర్మాజీపేట్–మద్దిపడగ క్రాసింగ్ వద్ద జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు రైతులు తమ సమస్యను వివరించగా, స్పందించిన కలెక్టర్ పంట పొలాలను పరిశీలించి సాగునీరు అందించేలా అధికారులను ఆదేశించారు. సదర్‌మాట్‌లో అందుబాటులో ఉన్న ఒక టీఎంసీ నీటిని పంట పొలాలకు అందించేలా చర్యలు తీసుకోవడంతో సాగునీటి విడుదల చేపట్టారు. రైతుల సమస్యపై స్పందించి సాగునీరు అందేలా చర్యలు తీసుకున్న కలెక్టర్‌కు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR