Nirmal: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భైంసాలో భగ్గుమన్న బీజేపీ నిరసనలు

Nirmal: నిర్మల్‌ జిల్లా భైంసాలో ప్రధాని మోదీ, హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ శ్రేణుల రాస్తారోకో; బేషరతు క్షమాపణ చెప్పాలని డిమాండ్.

Srinivas, Mondol Bhainsa
Published on: 1 Oct 2026 2:04 PM IST
Nirmal
X

Nirmal: సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భైంసాలో భగ్గుమన్న బీజేపీ నిరసనలు

Nirmal: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో బీజేపీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించి ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ నేతలు మండిపడ్డారు. భైంసా ప్రధాన కూడలిలో రాస్తారోకో చేపట్టి, సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దేవుళ్లను కూడా ధనిక, పేద వర్గాలుగా విభజించి మాట్లాడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, రేవంత్ రెడ్డి చిత్రపటాలను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఓ జాతీయ ఛానెల్ ఇంటర్వ్యూలో "ప్రధాన మంత్రి మోదీ జై శ్రీరామ్ అంటారు కానీ హర హర మహదేవ్ అని అనరు, ఎందుకంటే రాముడు ధనవంతుల దేవుడు,

శివుడేమో పేదోళ్ల దేవుడు" అని వ్యాఖ్యానించారని, ఇది హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆరోపించారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa