Basara: బాసరలో హోంగార్డుల నిజాయితీ.. భక్తురాలికి దక్కిన సెల్‌ఫోన్!
Basara: నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయానికి వచ్చిన నిజామాబాద్ భక్తురాలు పోగొట్టుకున్న రూ.30 వేల విలువైన మొబైల్ ఫోన్‌ను హోంగార్డులు నిజాయితీగా తిరిగి అప్పగించారు.
Basara: బాసరలో హోంగార్డుల నిజాయితీ.. భక్తురాలికి దక్కిన సెల్‌ఫోన్!
బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయ దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు పోగొట్టుకున్న ఖరీదైన మొబైల్ ఫోన్‌ను ఆలయ హోం గార్డులు నిజాయితీగా తిరిగి అప్పగించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన సమత మహేష్ అనే భక్తురాలు అమ్మవారి దర్శనార్థం బాసరకు విచ్చేశారు. ఈ క్రమంలో బాలాలయంలో సుమారు రూ.30 వేల విలువైన తన మొబైల్ ఫోన్‌ను మర్చిపోయి వెళ్లిపోయారు.
అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆలయ హోం గార్డులు నారాయణ, ఇందల్ ఆ ఫోన్‌ను గమనించి భద్రపరిచారు. అనంతరం ఆరా తీసి,సంబంధిత భక్తురాలు కు ఫోన్‌ను సురక్షితంగా అప్పగించారు. హోం గార్డులు చూపిన నిజాయితీ, సేవాభావంపై భక్తులు మరియు ఆలయ సిబ్బంది ప్రశంసలు కురిపించారు.




