Nirmal: బాసరలో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం భగ్నం!
Nirmal: బాసరలో ఆత్మహత్యకు యత్నించిన సిద్దిపేట జిల్లా వృద్ధ దంపతులను నిర్మల్ పోలీసులు మొబైల్ లొకేషన్ ఆధారంగా గుర్తించి కాపాడారు.
Nirmal: బాసరలో వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం భగ్నం!
నిర్మల్: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విట్టల పూర్ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు అయిన సత్యనారాయణ చారి (86) మరియు భార్య గోవిందమ్మ (81)లు కలిసి ఆత్మహత్య చేసుకుందామని బాసరకు రావడం జరిగింది. అని సమాచారం రాగా గౌరవ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఐపీఎస్ మేడం గారి ఆదేశాల మేరకు బైంసా ASP శ్రీ సాయి కిరణ్ ఐపీఎస్ గారి సూచనల మేరకు వారి మొబైల్ నెంబర్ తీసుకొని లొకేషన్ ఆధారంగా గాలించగా వారు టిటిడి కి సంబంధించిన రూమ్ నెంబర్ 122 లో ఉన్నారు.
వారు ఆత్మహత్య చేసుకుందామని ముందుగానే తెచ్చుకున్న పాయిజన్ ని కూడా వారి బ్యాగులో నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వారిని వారి కూతురు అయినా రేణుకను పిలిపించి వారికి సురక్షితంగా అప్ప చెప్పడం జరిగింది.
వీరికి ఒక కూతురు, ఆమె బెంగళూరులో నివాసం ఉంటుంది కూతురు భర్తను వదిలి మా దగ్గరికి వచ్చి ఉండడం మమ్మల్ని చూసుకోవడం వల్ల కూతురి సంసారం చెడిపోతుందనే ఉద్దేశంతో కూతుర్ని ఇబ్బంది పెట్టలేక ఇద్దరు కలిసి ఆత్మహత్య చేసుకుందామని బాసరకి వచ్చారు అని చెప్పడం జరిగింది.




