Basar: బాసరలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ఘనంగా ప్రారంభం!
Basar: నిర్మల్ జిల్లా బాసర గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల భీమా భరోసా కల్పిస్తామని తెలిపారు.
Basar: బాసరలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం ఘనంగా ప్రారంభం!
బాసర: నిర్మల్ జిల్లా బాసర గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా కార్యక్రమాన్ని అధికారులు ఘనంగా ప్రారంభించారు. ప్రతి కుటుంబానికి రూ.5లక్షల జీవిత భీమా భరోసా కల్పించడమే ఈ పథకం ముఖ్య లక్ష్యమని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేష్ గౌడ్, ఎంపీడీఓ రామకృష్ణ, ఏపీఓ సదానంద చారి, బాసర మండల స్పెషల్ ఆఫీసర్ రమణ, అగ్రికల్చర్ AEO హాదస్య, గ్రామ పంచాయతీ ఈవో ప్రసాద్ గౌడ్, ఉప సర్పంచ్ సయ్యద్ అలి, ఐకేపీ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
భీమా ప్రయోజనాలు, నమోదు విధానం, అవసరమైన పత్రాల గురించి అధికారులు వివరంగా వివరించారు. కుటుంబానికి అండగా నిలిచే ఈ పథకంలో అర్హులందరూ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని అధికారులు కోరారు. గ్రామంలోని ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ విజ్ఞప్తి చేశారు. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక భద్రత లభిస్తుందని, కష్టకాలంలో అండగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.




