Nirmal: ముధోల్‌లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. స్టెప్పులేసిన ఎమ్మెల్యే
Nirmal: నిర్మల్ జిల్లా ముధోల్‌లో గణేష్ నిమజ్జన శోభాయాత్రను ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు. వర్షంలో యువతతో కలిసి డ్యాన్స్ చేసి సందడి చేశారు.
Nirmal: ముధోల్‌లో గణేష్ నిమజ్జన శోభాయాత్ర.. స్టెప్పులేసిన ఎమ్మెల్యే
నిర్మల్ జిల్లా: ముధోల్ లో గణేష్ నిమజ్జన వేడుకలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమజ్జన శోభాయాత్రను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రారంభించారు.
వర్షాన్ని సైతం లెక్కచేయకుండా యువకులతో కలిసి ఎమ్మెల్యే ఉత్సాహంగా స్టెప్పులు వేసి సందడి చేశారు. యువత నృత్యాలతో ముధోల్ లో పండుగ వాతావరణం నెలకొంది.మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తి, ఉత్సాహం, కోలాహలం మధ్య గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది.




