Adilabad: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది,,ఎంపీ గోడం నగేశ్!
Adilabad: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి రైతులను మోసం చేస్తోందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ మండిపడ్డారు.
Adilabad: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోంది,,ఎంపీ గోడం నగేశ్!
Adilabad: ఎన్నికల హామీలను విస్మరించి రాష్ట్రంలోని రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ మండిపడ్డారు. ఆదిలాబాద్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సాగునీరు, కరెంటు అందక అన్నదాతలు పడుతున్న కష్టాలు చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి కష్టాలను గాలికొదిలేశారని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలను అరికట్టి, అన్నదాతలకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో ఈ నెల 23న ఆదిలాబాద్ నుంచి రైతు యాత్ర ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. ఆదిలాబాద్‌లో మాట్లాడుతూ.. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించే ఈ యాత్ర ద్వారా ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేయనున్నట్లు వెల్లడించారు. రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆయన ఆరోపించారు.




