Nirmal: నిర్మల్‌లో ఘనంగా మాంగల్య వస్త్ర దుకాణం ప్రారంభం!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాంగల్య వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన ఎంపీ గోడం నగేష్. హాజరైన సినీ నటి భాగ్యశ్రీ.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 8 Oct 2026 12:40 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్‌లో ఘనంగా మాంగల్య వస్త్ర దుకాణం ప్రారంభం!

Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటుచేసిన మాంగల్య వస్త్ర దుకాణాన్ని ఎంపీ గోడం నగేష్ ప్రారంభించారు. షాపింగ్ మాల్ కు చేరుకున్న ఎంపీ నగేష్ కు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి షాపింగ్ మాల్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్ జిల్లా ప్రజలకు ఈ షాపింగ్ మాల్ తో వస్తా ప్రపంచం మొత్తం అందుబాటులోకి వచ్చినట్లు అయిందని తెలిపారు. హైదరాబాద్ లాంటి పెద్ద నగరాలకు వెళ్లకుండా ఇక్కడే తమ అవసరాలకు షాపింగ్ చేయవచ్చని తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, స్థానిక కౌన్సిలర్ అడ్ప విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా సినీ తార భాగ్యశ్రీ చేసిన సందడి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. అదేవిధంగా వివిధ కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని విశేషంగా అలరించాయి.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL