Kadem: చిన్న బెల్లాల్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

Kadem: నిర్మల్ జిల్లా కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించి సౌకర్యాలను పరిశీలించారు.

RAKESH N, KHANAPUR
Published on: 13 Nov 2026 8:19 PM IST
Kadem
X

Kadem: చిన్న బెల్లాల్‌లో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే

నిర్మల్ జిల్లా: నిర్మల్ జిల్లా కడెం మండలం చిన్న బెల్లాల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు.

కొనుగోలు కేంద్రంలో రైతులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి మద్దతు ధర పొందాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ భూషణ్, ఆర్టీఏ సభ్యులు మల్లేష్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ రమేష్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు జొన్నల చంద్రశేఖర్, డైరెక్టర్ గొల్ల వెంకటేష్, స్థానిక సర్పంచులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, సంబంధిత అధికారులు, ఎమ్మార్వో, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR