Adilabad: ఘనంగా బిర్సా ముండా జయంతి.. డోలు వాయిద్యాలతో ఎమ్మెల్యే, ఎస్పీ డ్యాన్స్!

Adilabad: ఆదిలాబాద్‌లో హీరాసుఖా ఆదివాసి జాగృతి ఆధ్వర్యంలో భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 15 Nov 2026 1:52 PM IST
Adilabad
X

Adilabad: ఘనంగా బిర్సా ముండా జయంతి.. డోలు వాయిద్యాలతో ఎమ్మెల్యే, ఎస్పీ డ్యాన్స్!

Adilabad: ఆదివాసి వీరుడు భగవాన్ బిర్సా ముండా జయంతిని హీరాసుఖా ఆదివాసి జాగృతి ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ చిత్రు, మున్సిపల్ చైర్పర్సన్ అనూష పాల్గొని బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆదివాసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే, ఎస్పీ ఆదివాసి డోలు వాయిదాలపై ఉత్సాహంగా నృత్యం చేశారు.

కేవలం 25 సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన గొప్ప ఆదివాసి యోధుడు బిర్సా ముండా అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ కొనియాడారు.

భౌతికంగా ఆయన మన ముందు లేకపోయినా, ఆయన ఆలోచనలు, ఆశయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు. జంగల్, జమీన్ హక్కుల కోసం ఆదివాసులు పడుతున్న బాధలను, వారి హక్కుల సాధన కోసం చేసిన పోరాటాలను గుర్తుచేశారు. మహానుభావుల జీవిత చరిత్రను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

బిర్సా ముండాను ఆదర్శంగా తీసుకొని గిరిజన నాయకులు, తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గిరిజన గ్రామాల్లో ఇంకా కొనసాగుతున్న ఫకీర్లు, బాబాలు వంటి మూఢనమ్మకాలను ప్రజలు నమ్మవద్దని కోరారు.

గాంజాయి సాగు లేదా వ్యాపారం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కేసుల కారణంగా సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని పేర్కొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.