Adilabad: జి.ఎస్ కాలనీలో రూ.50 లక్షల రోడ్లు, డ్రైన్లకు భూమి పూజ!
Adilabad: ఆదిలాబాద్ జి.ఎస్ కాలనీలో రూ.50 లక్షల సీసీ రోడ్లు, డ్రైన్ల పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ భూమి పూజ చేశారు. రూ.300 కోట్ల అమృత్ పనుల వివరాలు వెల్లడించారు.
Adilabad: జి.ఎస్ కాలనీలో రూ.50 లక్షల రోడ్లు, డ్రైన్లకు భూమి పూజ!
Adilabad: ఆదిలాబాద్ పట్టణంలోని జి.ఎస్ కాలనీలో దాదాపు రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్లు, సైడ్ డ్రైన్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ అనూష తో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ ఆదిలాబాద్‌పై ఉన్న 'వెనుకబడిన ప్రాంతం' అనే ముద్రను చెరిపివేసి, గొప్ప నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఇప్పటికే ఆదిలాబాద్‌కు ఎయిర్‌పోర్ట్ నిర్మాణం, ఇండస్ట్రీ పార్క్ వంటి భారీ ప్రాజెక్టులు మంజూరయ్యాయని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులను ఎలాంటి వివక్ష లేకుండా సమానంగా అభివృద్ధి చేస్తున్నామని, వెనుకబడిన వార్డులకు ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.
పట్టణంలో భవిష్యత్తులో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అమృత్ పథకం కింద రూ. 300 కోట్ల నిధులతో పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. సాత్నాల, మత్తడివాగు, కోటాచానాక ప్రాజెక్టుల నుండి పట్టణానికి సరిపడా తాగునీరు అందించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.




