Adilabad: మూడు నెలల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేయాలి.. ఎమ్మెల్యే!
Adilabad: ఆదిలాబాద్‌లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పాయల్ శంకర్ అకస్మాత్తుగా పరిశీలించి, మూడు నెలల్లోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Adilabad: మూడు నెలల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేయాలి.. ఎమ్మెల్యే!
Adilabad: ఆదిలాబాద్ లోని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను మంగళవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ అకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు కొనసాగుతున్న తీరును ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాబ్ నిర్మాణ పనుల ఆలస్యానికి గల కారణాలను కాంట్రాక్ట్ ఎమ్మెల్యేకు వివరించారు. దీంతో వెంటనే ఎమ్మెల్యే అధికారులతో ఫోన్ లో మాట్లాడి ప్రజల ఇబ్బందుల దృష్ట్యా జాప్యం లేకుండా నిర్మాణా పనుల వేగం పెంచాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను మూడు నెలల లోపు పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు అన్నారు. ఈ ప్రాజెక్ట్ నటికి నూరు శాతం కేంద్రం నుంచే పూర్తిగా నిధులు తీసుకొచ్చి రైల్వే శాఖకు అందజేసినట్లు స్పష్టం చేశారు.
పట్టణంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభించనుందని ఆయన పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో పనులను త్వరతగతిన పూర్తి చేస్తామన్నారు.




