Adilabad: ఆదిలాబాద్‌లో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఘనంగా ప్రారంభించారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 14 Nov 2026 3:10 PM IST
Adilabad
X

Adilabad: ఆదిలాబాద్‌లో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభం!

Adilabad: జాతీయ గ్రంథాలయ వారోత్సవాల కార్యక్రమాన్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు. ముందుగా సరస్వతి చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. గ్రంథాలయాలు విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని, ఆదిలాబాద్ జిల్లా గ్రంథాలయాన్ని మరింత అభివృద్ది చేయడానికి తన వంతు పూర్తి సహకారం అందిస్తామనిస్పష్టం చేశారు. గతంలోనూ తాను లైబ్రరీకి అవసరమైన వసతులను సమకూర్చానని, భవిష్యత్తులో కూడా గ్రంథాలయ అభివృద్ధికి తన సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు.

పుస్తక పఠనంతోనే ఉజ్వల భవిష్యత్తు, శాశ్వత జ్ఞానం ఉంటుందని పేర్కొన్నారు. లైబ్రరీలో గ్రంథాలు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతీయువకులను ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించాలని, వారిని మిగతా విద్యార్థులకు ఆదర్శంగా నిలపాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చిత్రు, మున్సిపల్ చైర్ పర్సన్ అనూష, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరసయ్య పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.