Adilabad: సీఎం రేవంత్ రెడ్డితో సమావేశంలో రిమ్స్ సమస్యలపై చర్చిస్తామని వెల్లడి!

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి రూ. 100 కోట్లకు పైగా నిధులు కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 26 Sept 2026 3:04 PM IST
Adilabad
X

Adilabad: సీఎం రేవంత్ రెడ్డితో సమావేశంలో రిమ్స్ సమస్యలపై చర్చిస్తామని వెల్లడి!

Adilabad: ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ అన్నారు.. రిమ్స్ ఆస్పత్రిలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తానని, దాదాపు 100 కోట్లకు పైనే నిధులు అవసరం ఉందని ఇందుకు సంబంధించి సోమవారం సీఎం రేవంత్ రెడ్డి తో నిర్వహించే సమావేశంలో అన్ని విషయాలు వివరిస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు.

రిమ్స్ ఆడిటోరియంలో వివిధ విభాగాల అధికారులు, వైద్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు శంకర్.. రిమ్స్ ఆస్పత్రిలో కావలసిన సౌకర్యాలు కల్పించవలసిన వసతులపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర రాజధానికి అత్యంత దూరంలో ఉన్న ఆదిలాబాద్ ప్రజలకు, అలాగే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుండి వచ్చే పేద రోగులకు రిమ్స్ ఏకైక దిక్కు అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా తరహాలోనే రిమ్స్‌పై కూడా తీవ్ర ఒత్తిడి ఉందని పేర్కొన్నారు.

నిధుల మంజూరుతో పాటు వైద్యులు, ఇతర సిబ్బంది ఖాళీలను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని కోరారు. రిమ్స్ బాగుపడాలంటే ఇప్పటికే 11 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం పూర్తిస్థాయిలో అభివృద్ధి కోసం దాదాపు వంద కోట్ల పైనే నిధులు అవసరమని ప్రాథమిక అంచనా వేసినట్లు పేర్కొన్నారు. ఈ నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మరియు ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయిస్తామని తెలిపారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.