Nirmal: కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

Nirmal: అధికారం కోల్పోయాక కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ అవినీతిపై చర్చకు సిద్ధమా అని బీజేఎల్పి నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 12 Nov 2026 3:44 PM IST
Nirmal
X

Nirmal: కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఫైర్!

Nirmal: అధికారం కోల్పోయిన వెంటనే బీఆర్ఎస్ కార్యనిర్వాక అధ్యక్షుడు కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని బీజేఎల్పి నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

నిన్న నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు గర్జన సభలో అన్ని అబద్ధాలు మాట్లాడి రైతులను, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. బిజెపి కి చెందిన 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలను అష్ట గ్రహాలుగా అభివర్ణించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేం అష్ట గ్రహాలం కాదని, గత పది సంవత్సరాల క్రితం మీరే తెలంగాణకు పట్టిన దుష్ట గ్రహాలని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు నిర్మల్లో వంద పడకల ఆసుపత్రి తో పాటు రైల్వే లైన్ కు లైన్ క్లియర్ చేయించిన ఘనత తమదేనన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దండుకున్న చరిత్ర మీది కాదా అని ప్రశ్నించారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన మీరు ఫామ్ హౌస్లకు పరిమితమైతే ఆ ప్రతిపక్షపాత్రను తాము పోషిస్తూ ప్రజల సమస్యలను అసెంబ్లీలో వినిపిస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై ఆధారాలతో వస్తానని కెసిఆర్, కేటీఆర్ లు చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.

మీరు చెప్పిన చోటుకే తాను వస్తానని దమ్ముంటే చర్చకు రావాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని తమ అక్రమాలపై చర్యలు తీసుకోకుండా రాజకీయాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బిజెపి ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL