Adilabad: జర్నలిస్టుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరాను!

Adilabad: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలో శ్రీ వెంకటేశ్వర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసి సీనియర్ జర్నలిస్టులను సత్కరించిన 'మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026' ప్రీతి ముండే.

NAGULA SATISH, BOATH
Published on: 8 Oct 2026 7:15 AM IST
Adilabad
X

Adilabad: జర్నలిస్టుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరాను!

Adilabad: ​మీడియా అందించిన తొలి ప్రోత్సాహం, నిరంతర తోడ్పాటుతోనే తాను జాతీయ స్థాయిలో 'మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026' కిరీటాన్ని దక్కించుకోగలిగానని ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ వాసి ప్రీతి ముండే స్పష్టం చేశారు. స్థానిక శ్రీ వేంకటేశ్వర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా, ప్రత్యేక ఆకర్షణగా విచ్చేసిన ఆమె టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు, సీనియర్ జర్నలిస్టు బేత రమేష్, బోథ్ ఎలక్ట్రానిక్ మీడియా సీనియర్ జర్నలిస్టు నాగుల సతీష్‌లను శాలువాలతో ఘనంగా సత్కరించి తన కృతజ్ఞతను చాటుకున్నారు.

​తన ప్రస్థానం మొదలైన తొలి రోజుల్లోనే ప్రతిభను గుర్తించి, మొట్టమొదటిసారిగా వార్తా కథనాల ద్వారా సమాజానికి వెలుగులోకి తెచ్చిన పాత్రికేయుల సహకారం మరువలేనిదని ఆమె పేర్కొన్నారు.

మీడియా వెన్నుదన్నుగా నిలవడం వల్లే గ్రామీణ నేపథ్యం నుంచి జాతీయ వేదికలపై సత్తా చాటే ఆత్మవిశ్వాసం కలిగిందని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో చేపట్టబోయే సామాజిక, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లోనూ పాత్రికేయ మిత్రుల సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH