Nirmal: రేపు నిర్మల్ జిల్లాలో మంత్రులు జూపల్లి, పొంగులేటి పర్యటన!

Nirmal: సోమవారం నిర్మల్ జిల్లాలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటన. రూ.23.35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, సమీక్ష.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 4 Oct 2026 1:04 PM IST
Nirmal
X

Nirmal: రేపు నిర్మల్ జిల్లాలో మంత్రులు జూపల్లి, పొంగులేటి పర్యటన!

Nirmal: నిర్మల్‌ జిల్లాలో సోమవారం పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, గృహ నిర్మాణ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించనున్నారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని జిల్లాల కలెక్టర్లతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి, రెవిన్యూ సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించనున్నారు.

అంతకుముందు నిర్మల్ జిల్లాలో రూ.23.35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ఐడీఓసీలో ప్రజా సమస్యలపై ఫిర్యాదులను స్వీకరిస్తారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL