Mancherial: మంచిర్యాలలో ఘనంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదినం
Mancherial: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
Mancherial: మంచిర్యాలలో ఘనంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదినం
Mancherial: మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. శ్రీరాంపూర్ నుంచి మంచిర్యాల కాలేజ్ రోడ్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ జెండాలతో బైక్‌లపై తరలివచ్చిన శ్రేణులతో ర్యాలీ సందడిగా సాగింది.
అనంతరం పద్మనాయక ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ విజయ రమణారావు హాజరై ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు శుభాకాంక్షలు తెలిపేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో మంచిర్యాల పట్టణంలో జన్మదిన వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగాయి.




