Mancherial: ఖమ్మం జిల్లాకు చెందిన సంచార జీవుల కుటుంబంలో తీవ్ర విషాదం!

Mancherial: మంచిర్యాల జిల్లా ఇందారంలో నీటి కుంటలో పడి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బాలికలు సహా ముగ్గురు సంచార మహిళలు ప్రమాదవశాత్తు మృతి చెందారు.

RAJENDER, CHENNUR
Published on: 25 Oct 2026 6:51 PM IST
Mancherial
X

Mancherial: ఖమ్మం జిల్లాకు చెందిన సంచార జీవుల కుటుంబంలో తీవ్ర విషాదం!

Mancherial: జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీటి కుంటలో పడి ముగ్గురు మహిళలు మృతి. మృతుల ఇద్దరూ బాలికలతో సహా ఒక మహిళలు నీటి కుంటలో పడి మృతి చెందారు.

మృతి చెందిన వారు ఊరు ఊరు తిరుగుతూ వారు తయారు చేసిన సామాన్లు అమ్ముకుంటూ వెళ్లే సంచార జీవులుగా గుర్తించిన పోలీసులు. బట్టలు ఉతికేందుకు నీటి కుంట వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మహిళలు మృతి చెందినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణలో తేలింది.

ప్రమాదవశాత్తు మొదట బాలిక నీటి కుంటలో పడడంతో బాలికను కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు మహిళలు కూడా కుంటలో గల్లంతయినట్టు సమాచారం. దీంతో నీటి కుంటలో పడి ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు ఖమ్మం జిల్లాకు చెందిన సంచార జీవులుగా గుర్తించిన పోలీసులు.ఒకే కుటుంబానికి చెందిన మొత్తం ముగ్గురు మహిళలు మృతి చెందారు.

మృతి చెందిన వారి వివరాలు...!

1. కావ్య -9 సంవత్సరాలు.

2. కీర్తన -16 సంవత్సరాలు.

3. మనమ్మ - 24 సంవత్సరాలు.

నిన్ననే ఇందారం గ్రామానికి వచ్చి నివాసం ఉండేందుకు గుడారాలు ఏర్పాటు చేసుకున్న కుటుంబాలు. ఇంతలోనే ఈ విషాద ఘటనకు జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా వినిపిస్తున్నారు.

ఇనుప మంచాలు, పరుపులు తయారుచేసి ఊరు ఊరు తిరుగుతూ అమ్ముకుంటూ ఉంటూ జీవనం సాగించే సంచార కుటుంబాలుగా గుర్తించిన పోలీసులు.

సంఘటనా స్థలానికి చేరుకున్న జైపూర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ను ప్రారంభించారు.పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

RAJENDER, CHENNUR

RAJENDER, CHENNUR