Nirmal: నిర్మల్ జిల్లాలో విషాదం, గణేష్ నిమజ్జనంలో నీట మునిగి వ్యక్తి మృతి!

Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట్ పరిధిలో గణేష్ నిమజ్జనంలో అపశృతి. కడెం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్‌లో మునిగి వ్యక్తి మృతి. కేసు నమోదు చేసిన పోలీసులు.

RAKESH N, KHANAPUR
Published on: 25 Sept 2026 2:27 PM IST
Nirmal
X

Nirmal: నిర్మల్ జిల్లాలో విషాదం, గణేష్ నిమజ్జనంలో నీట మునిగి వ్యక్తి మృతి!

Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలం ధర్మాజీపేట్ పంచాయతీ పరిధిలోని కుర్రగూడ గ్రామంలో గణేష్ నిమజ్జనంలో భాగంగా నిన్న రాత్రి 8 గంటలకు మొదలైన గణేష్ శోభయాత్ర ఈరోజు ఉదయం 11 గంటల వరకు కొనసాగింది. ఈ నేపథ్యంలో కుర్రగూడ సమీపంలోని కడెం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో గణేష్ మండప నిర్వాహకులు గణపతిని నిమజ్జనం చేస్తుండగా చుంచు రమేష్ (45) అనే వ్యక్తి నీట మునిగడు వెంటనే గణేశ్ మండప నిర్వాహకులు రమేష్ ను నీటిలో నుండి బయటకు తీసేసరికి అప్పటికే రమేష్ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న కడెం ఎస్ఐ సాయికిరణ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR