Neradigonda: నేరడిగొండలో పత్తి పంట మధ్య అక్రమ గంజాయి సాగు భగ్నం!
Neradigonda: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం అరేపల్లిలో పత్తి పంట మధ్య అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి 51 మొక్కలు స్వాధీనం చేసుకున్నారు.
Neradigonda: నేరడిగొండలో పత్తి పంట మధ్య అక్రమ గంజాయి సాగు భగ్నం!
Neradigonda: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం అరేపల్లి గ్రామ శివారులో పత్తి పంట మధ్యలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న సిడాం గంగారాం(60) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు నేరడిగొండ ఎస్సై సయ్యద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి తప్పించుకునేందుకు ప్రయత్నించిన నిందితుడిని చాకచక్యంగా అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అతడికి చెందిన ROFR పట్టా భూమిలో పత్తి పంట మధ్య రహస్యంగా అంతర పంటగా సాగు చేస్తున్న 4 నుంచి 5 అడుగుల ఎత్తు పెరిగిన 51 గంజాయి మొక్కలను పోలీసులు వేర్లతో సహా తొలగించి స్వాధీనం చేసుకున్నారు.
సీజ్ చేసిన ఈ మొక్కల విలువ మార్కెట్లో సుమారు రూ.5.10 లక్షల వరకు ఉంటుందని ఇచోడ రూరల్ సీఐ సిహెచ్ రమేష్ వెల్లడించారు.
ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఎవరైనా గంజాయి సాగు, విక్రయాలు లేదా రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, అలాంటి రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిపివేసేలా సిఫార్సు చేస్తామని సీఐ హెచ్చరించారు. అక్రమ గంజాయి సమాచారం తెలిసిన వారు నిర్భయంగా 8712659973 నంబర్‌కు వాట్సాప్ ద్వారా జిల్లా ఎస్పీకి తెలియజేయవచ్చని, వివరాలు అందించిన వారి గోప్యతను కాపాడుతామని స్పష్టం చేశారు.




