Adilabad: మహికో ధన్ దేవ్ ప్లస్ పత్తితో భారీ దిగుబడి: రైతు హర్షం!
Adilabad: తాంసి మండలం పున్నారి గ్రామంలో మహికో కంపెనీ 'ధన్ దేవ్ ప్లస్' పత్తి విత్తనాలతో భారీ దిగుబడి సాధించిన రైతు. క్షేత్ర పర్యటనలో సత్కరించిన ప్రతినిధులు.
Adilabad: మహికో ధన్ దేవ్ ప్లస్ పత్తితో భారీ దిగుబడి: రైతు హర్షం!
Adilabad: వర్షాభావ పరిస్థితులలోనూ మహికో కంపెనీ విత్తనాలు వేసిన రైతులు మంచి పంట దిగుబడును సాధిస్తున్నారని ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తాంసి మండలం పున్నారి గ్రామంలో ఆడే నారాయణ అనే రైతు తన నాలుగు ఎకరాల పొలంలో మహికో కంపెనీకి చెందిన ధన్ దేవ్ ప్లేస్ రకం పత్తి విత్తనాలు వేయగా, ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా మంచి కాత పూతలతో, ఎలాంటి చీడపీడల బెడద లేకుండా మంచి కాయలు కాసి అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉండడంతో సదరు రైతు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎకరాకు 12 నుండి 15 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉన్నట్టు సదరు రైతు తెలుపగా ఈరోజు ఆ కంపెనీకి చెందిన రీజినల్ మేనేజర్ తో పాటు ఇతర కంపెనీ ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు సదరు రైతు పొలంలో విక్రయదారుల క్షేత్ర పర్యటన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సదరు రైతును శాలువాతో సత్కరించారు.. మహికో కంపెనీకి చెందిన అన్ని రకాల విత్తనాలు ఈసారి మంచి దిగుబడిలో వచ్చే అవకాశం ఉందని తెలిపారు ప్రతినిధులు. ఈ కార్యక్రమంలో రైతు సంఘ నేతలు కురుమ లక్ష్మణ్, లింగారెడ్డి, అశోక్, డిస్ట్రిబ్యూటర్లు కత్తూరి ప్రశాంత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




