Bhainsa: భైంసా పట్టణ సమస్యలపై మున్సిపల్ అధికారులకు వినతిపత్రం!

Bhainsa: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరుతూ మున్సిపల్ అధికారులకు వినతిపత్రం.

Srinivas, Mondol Bhainsa
Published on: 6 Oct 2026 1:57 PM IST
Bhainsa
X

Bhainsa: భైంసా పట్టణ సమస్యలపై మున్సిపల్ అధికారులకు వినతిపత్రం!

Bhainsa: భైంసా పట్టణ అభివృద్ధికి మంజూరైన నిధులను సద్వినియోగం చేసి, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరుతూ మున్సిపల్ మేనేజర్ అబ్దుల్ రహమాన్ కి వినతిపత్రం అందించారు. పట్టణంలో పారిశుద్ధ్యం, రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.ప్రజల నుంచి వస్తున్న సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలని, మంజూరైన నిధులతో అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసి పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో మాజీ కౌన్సిలర్ కపిల్, నాయకులు గాలి రవి, మహేష్, ప్రవీణ్, అనిల్ తదితరులు వున్నారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa