Nirmal: తెలంగాణలో మరో ఊటీ కొడైకెనాల్‌ను తలపిస్తున్న కవ్వాల్ అడవులు!
Nirmal: నిర్మల్ జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో దట్టమైన పొగమంచు, పచ్చటి అడవుల అందాలు ఊటీ, కొడైకెనాల్‌ను తలపిస్తూ పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.
Nirmal: తెలంగాణలో మరో ఊటీ కొడైకెనాల్‌ను తలపిస్తున్న కవ్వాల్ అడవులు!
Nirmal: నిర్మల్ జిల్లా పరిధిలోని కడెం, దుస్తురాబాద్, జన్నారం మండలాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతం ప్రస్తుతం సరికొత్త శోభను సంతరించుకుంది. ఉదయం లేవగానే ఇక్కడి ప్రకృతి దృశ్యాలు చూస్తే.. ఏదో హిల్ స్టేషన్‌కు వచ్చామా అనే అనుభూతి కలుగుతోంది.
పచ్చటి దట్టమైన అడవుల మధ్య కారుమబ్బుల అందాలు, అడవి ప్రాంతాన్ని పూర్తిగా కమ్మేస్తున్న పొగమంచు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రకృతి పరచిన పచ్చటి తివాచీలా ఉన్న ఈ అడవుల్లో ఉదయం పూట ప్రయాణం సరికొత్త అనుభూతిని ఇస్తోంది. ఇక్కడి అద్భుతమైన వాతావరణం కారణంగా స్థానిక మండలవాసులు ఎంతో ఆనందంగా జీవనం సాగిస్తున్నారు. పట్టణ కాలుష్యానికి దూరంగా.. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం తమ జీవన ప్రమాణాలను, ఆయుష్షును పెంచుతోందని ఇక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.




