Kagaznagar: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు – స్వచ్ఛందంగా రక్తదానం!

Kagaznagar: కాగజ్ నగర్ కిమ్స్ ఆసుపత్రిలో ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం. వైస్ ఛైర్‌పర్సన్ డాక్టర్ అనితా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహణ.

LALITH KUMAR, SIRPUR
Published on: 17 Sept 2026 12:51 PM IST
Kagaznagar
X

Kagaznagar: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు – స్వచ్ఛందంగా రక్తదానం!

Kagaznagar: కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను భారతీయ జనతా పార్టీ (భాజపా) నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రధాని పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమాల్లో భాగంగా పట్టణంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

కాగజ్ నగర్ పురపాలిక వైస్ చైర్ పర్సన్ డాక్టర్ కొత్తపల్లి అనిత శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో ఈ రక్తదాన కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. ఈ శిబిరానికి స్థానికుల నుంచి మంచి స్పందన లభించింది. పలువురు భాజపా నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ సేవా దృక్పథాన్ని, దేశాభివృద్ధి పట్ల ఆయనకున్న నిబద్ధతను ఆదర్శంగా తీసుకొని ప్రజల ప్రాణాలు కాపాడే ఈ రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కిమ్స్ ఆసుపత్రి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LALITH KUMAR, SIRPUR

LALITH KUMAR, SIRPUR