Gudihathnoor: తోషం ZPSS పాఠశాలలో 'జల ప్రతిజ్ఞ'!

Gudihathnoor: తోషం జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులతో MEO గోపాల్ సింగ్ తిలావత్ 'జల ప్రతిజ్ఞ' చేయించారు. ఎల్ నినో దృష్ట్యా నీటి పొదుపుపై అవగాహన కల్పించారు.

NAGULA SATISH, BOATH
Published on: 21 Nov 2026 2:28 PM IST
Gudihathnoor
X

Gudihathnoor: తోషం ZPSS పాఠశాలలో 'జల ప్రతిజ్ఞ'!

Gudihathnoor: పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు గుడిహత్నూర్ మండలం తోషం జిల్లా పరిషత్ పాఠశాలలో జల ప్రతిజ్ఞ' కార్యక్రమాన్ని నిర్వహించారు.

​ఈ సందర్భంగా తోషం ZPSS ప్రధానోపాధ్యాయుడు, గుడిహత్నూర్ MEO గోపాల్ సింగ్ తిలావత్ విద్యార్థులతో జల ప్రతిజ్ఞ చేయించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడుకుంటామని, వర్షపు నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రమాణం చేశారు.

'ఎల్ నినో' (El Niño) ప్రభావం కారణంగా వాతావరణ మార్పులు సంభవించి భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు, తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని అందుకే ఇప్పటి నుంచే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భావితరాలకు నీటి కొరత లేని భవిష్యత్తును అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH