Adilabad: ఈ నెల 9న ఐటీ హబ్ ప్రారంభించనున్న మంత్రి శ్రీధర్ బాబు!

Adilabad: ఈ నెల 9న ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పర్యటించనున్నట్లు డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ తెలిపారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 6 Nov 2026 12:46 PM IST
Adilabad
X

Adilabad: ఈ నెల 9న ఐటీ హబ్ ప్రారంభించనున్న మంత్రి శ్రీధర్ బాబు!

Adilabad: ఈనెల 9న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదిలాబాద్ లో పర్యటిస్తున్నట్లు డిసిసి అధ్యక్షుడు నరేష్ జాదవ్ తెలిపారు. పర్యటనలో భాగంగా పట్టణ శివారులో నిర్మించిన ఐటీ హబ్ ను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. ఐటి హబ్ ద్వారా జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు.

శుక్రవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఐటీ హబ్ కు మూడు కంపెనీలు వస్తున్నాయని.. మిగతా కంపెనీలు సైతం ముందుకు వచ్చి స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

మరోవైపు ఇటీవల రైతు గర్జన సభలో బి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కేటీఆర్ కి తాము ఒకటే సవాలు చేస్తున్నామని.. తన సొంత సోదరి కవిత ఆయనపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

గత పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని దోచుకున్నది మీరే కాదని ప్రశ్నించారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కోసం దళారులను మంజూరు ఎవరిని నమ్మవద్దని సూచించారు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే తమను సంప్రదించాలని కోరారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.