Nirmal: భూ సమస్యల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు: నిర్మల్ కలెక్టర్!

Nirmal: భూ సమస్యల దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచొద్దు నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశం భూ భారతి, సాదాబైనామా పరిష్కారాలు, రీ-సర్వేపై అధికారులతో సమీక్ష.

THAKUR ANANTH RAM SING, NIRMAL
Published on: 3 Oct 2026 5:21 PM IST
Nirmal
X

Nirmal: భూ సమస్యల దరఖాస్తులు పెండింగ్‌లో ఉంచొద్దు: నిర్మల్ కలెక్టర్!

నిర్మల్: జిల్లాలో భూ సమస్యలకు సంబంధించి అన్ని దరఖాస్తులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో భూ సంబంధిత దరఖాస్తుల పరిష్కారం, భూముల రీ సర్వే పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మండలాల వారిగా పెండింగ్ లో ఉన్న భూ భారతి, రెవెన్యూ సదస్సులు, సదాబైనమా, దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అన్నారు. జిల్లాలో కొనసాగుతున్న భూముల రీ సర్వే ను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. సర్వే బృందం మొత్తం తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఇన్ ఛార్జ్ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాథోడ్ రమేష్, భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ రాకేష్, ఆర్డీవో దేవీదాస్, రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

THAKUR ANANTH RAM SING, NIRMAL

THAKUR ANANTH RAM SING, NIRMAL