Adilabad: వాట్సాప్ లింక్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరస్తుడి అరెస్ట్!

Adilabad: వాట్సాప్ లింకుల ద్వారా మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడు దినేష్ పటేల్‌ను ఆదిలాబాద్ జిల్లా బేల పోలీసులు అరెస్ట్ చేశారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 26 Oct 2026 4:48 PM IST
Adilabad
X

Adilabad: వాట్సాప్ లింక్ మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరస్తుడి అరెస్ట్!

Adilabad: వాట్సాప్ లింకుల ద్వారా అకౌంట్స్, క్రెడిట్ కార్డుల నుంచి రూ.4.20 లక్షలు కాజేసిన రాజస్థాన్ కు చెందిన దినేష్ పటేల్ అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుడిని అదిలాబాద్ జిల్లా బేల పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం ఏఆర్ హెడ్ కోటర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు.

నిందితుడు అమ్మాయిల వలపు సేవల పేరుతో నకిలీ లింకులు పంపుతూ దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నాడు అన్నారు. నిందితుడిపై దేశవ్యాప్తంగా 220 ఫిర్యాదులు ఉండగా తెలంగాణ లో 20 ఫిర్యాదులు ఉన్నాయన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.