Nirmal: నిర్మల్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా నల్ల వినయ్ రెడ్డి బీఆర్ఎస్ ప్రవేశం!
Nirmal: నిర్మల్ జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు. త్వరలో బీఆర్ఎస్ పార్టీలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త నల్ల వినయ్ రెడ్డి. నవంబర్ 11న కేటీఆర్ సమక్షంలో చేరిక.
Nirmal: నిర్మల్ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా నల్ల వినయ్ రెడ్డి బీఆర్ఎస్ ప్రవేశం!
Nirmal: నిర్మల్ జిల్లాలో కారు పార్టీకి స్టిరీంగ్ పట్టేందుకు విద్యావంతుడు, ఓ ప్రముఖ పారిశ్రమిక వేత రెడీ అయ్యారట.. గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన ఓ మాజీ మంత్రికి, ఓ మాజీ ఎమ్మెల్యే లకు తిరిగి పార్టీలో చేరికకు నో ఎంట్రి అంటున్నారట ఇప్పటికే స్వచ్చంద సేవ కార్యక్రమాలతో దూసుకుపోతున్న డా.నల్ల వినయ్ రెడ్డి కారు పార్టీలో షికారు రంగం సిద్దమైనట్లుగా సాగుతున్న ప్రచారం.
నిర్మల్ జిల్లాలో హాట్ హాట్ గా మారుతున్న రాజకీయ సమీకరణల పై రిపోర్ట్. దశాబ్దకాలం వరకు గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న నిర్మల్ జిల్లా గత అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఫూర్తీగా ఢీలా పడిపోయింది అప్పటి వరకు రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేసిన అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ముధోల్ మాజీ ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డిలు పార్లమెంట్ ఎన్నికల నాటికి గులాబీ పార్టీకి హ్యాండ్ ఇచ్చి హస్తం పార్టీలో చేరిపోయారు అప్పటి నుండి పార్టీ జిల్లా అధ్యక్షుని పదవి ఖాళీ ఏర్పడి ద్వితీయ శ్రేణి క్యాడర్ తోనే పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అయితే హస్తం పార్టీలో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి.
విఠల్ రెడ్డీలకు కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేక పట్టింపు కరువై మళ్లీ గులాబీ పార్టీలో చేరేందుకు ఇప్పటి వరకు అనేక ప్రయత్నాలు సాగించినట్లు ప్రచారం సాగింది గతంలో బీఎస్పీ పార్టీ నుండి ఎమ్మెల్యే గెలిచిన ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే గా గెలుపొందిన విఠల్ రెడ్డిలు గులాబీ కండువా కప్పుకోవడంతో ఐకే రెడ్డి కి మంత్రి పదవి కట్టబెట్టారు కేసీఆర్అయితే ఈ ఇద్దరు నేతల పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వీడి నమ్మక ద్రోహం చేశారని, ఇక వారికి గులాబీ పార్టీలో తీసుకునే ప్రసక్తే లేదని ఇక వారికి పార్టీలో నో ఎంట్రి అంటూ ప్రచారం సాగుతుండగా, స్థానికంగా పార్టీని నడిపిస్తున్న నేతలు సైతం వీరి చేరికను వ్యతిరేకిస్తున్నారు దీంతో గులాబీ పార్టీ నిర్మల్ జిల్లాలో కొత్త జోష్ నింపేందుకు రంగం సిద్దంచేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది .
ఓ ప్రముఖ్య వ్యాపరవేత, యువకుడు నల్లా వినయ్ రెడ్డి త్వరలోనే గులాబీ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకోగా నవంబర్ 11న నిర్మల్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి కేటీఆర్ సమక్షంలో గులాబీ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి నల్ల వినయ్ రెడ్డి చేరికకు సంబందించి ఇప్పటికే కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా టికెట్ ఫై కేటీఆర్ భరోసా ఇచ్చినట్లు త్వరలోనే గులాబీ తీర్థపుచ్చుకోనున్నారు వినయ్ రెడ్డి.
లక్ష్మణచాంద మండలం వడ్యాల్ కు చెందిన నల్లా వినయ్ రెడ్డి ప్రస్తుతం వ్యాపార రంగంలో స్థిరపడి ఉండగా, గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలో స్వచ్చంద సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.. నిర్మల్ నియోజకవర్గంలోని ప్రజలు రాబోయే ఎన్నికల్లో కొత్త నాయకుడిని చూడబోతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటివరకు నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉండగా రాబోయే రోజుల్లో చతుర్ముఖ పోటీ ఉండబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం.
వడ్యాల్ గ్రామానికి చెందిన నల్ల వినయ్ రెడ్డి పారిశ్రామికవేత్త రాజకీయాల్లోకి అరంగేట్రం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుక్నారు. ఎంబీఏ విద్యాభ్యాసం చేసిన నల్ల వినయ్ రెడ్డి హైదరాబాదులో స్థిరపడ్డారు. హైదరాబాద్‌లో వ్యాపారం చేసే ఈయన వచ్చేనెల రెండవ వారంలో కేటీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారు అయినట్లు పార్లీ వర్గాల్లో ప్రచారం మొదలైంది. ఆయన చేరికను క్యాడర్ కూడా స్వాగతిస్తున్నారు.
నల్ల వినయ్ రెడ్డి తాత నల్ల భీమ్ రెడ్డి గతంలో నిర్మల్ సమితి అధ్యక్షుడిగా రెండుసార్లు పనిచేశారు. అదేవిధంగా ఆయన పెద్దనాన్న నల్ల రాంరెడ్డి 30 సంవత్సరాలు సర్పంచ్ గా పని చేసిన అనుభవం ఉంది. ఆయన పెద్దమ్మ కల్పన రాంరెడ్డి సైతం ఎంపీటీసీ తో పాటు పలు హోదాల్లో రాజకీయాల్లో ఉన్నారు. అదేవిధంగా ఆయన కుటుంబంతో సంబంధం ఉన్న నల్ల నరేందర్ రెడ్డి ఎంపీపీగా పనిచేశారు. నిర్మల్ నియోజకవర్గంలో కొత్త నాయకుడు రాజకీయంలో అడుగుపెడుతుండడంతో పెను మార్పులు చోటు చేసుకోనున్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
కాగా నవంబర్ 11న స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొననున్నారు అదే సభలో నల్లా వినయ్ రెడ్డి పార్టీ కండువా కప్పుకొనున్నారు ఇప్పటికే ఆదిలాబాద్ నియోయకవర్గం నుండి మాజీ డీసీసీ అధ్యక్షులు భార్గావ్ దే్శ్పాండే గులాబీ పార్టీ లో చేరనున్నాట్లు ప్రకటించదా, నవంబర్ 1వ తేదీని ఆదిలాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేటీఆర్ హాజరుకానున్నారు అదే వేదికపై భార్గవ్ గులాబీ కండువా కప్పుకోనున్నారు మొత్తంగా ఈ ఇద్దరు నేతల చేరికకు రంగం సిద్దం కావడంతో గులాబీ క్యాడర్లో కొత్త జోష్ కనిపిస్తుండగా, రాజకీయా సమీకరణలు వచ్చే ఎన్నికల నాటి మారిపోతాయనేది పొలిటికల్ సర్కిల్ లో టాక్ నడుస్తోంది.




