Adilabad: 30న ఇంద్రవెల్లిలో టిఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ

Adilabad: అక్టోబర్ 30న ఇంద్రవెల్లిలో టిఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ. సభా ప్రాంగణాన్ని పరిశీలించిన రాథోడ్ బాపురావు, సిడాం దయాకర్. విజయవంతం చేయాలని పిలుపు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad
Published on: 22 Oct 2026 7:02 PM IST
Adilabad
X

Adilabad: 30న ఇంద్రవెల్లిలో టిఆర్ఎస్ పాంచజన్య సంకల్ప సభ

ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అక్టోబర్ 30న నిర్వహించనున్న పాంచజన్య సంకల్ప సభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పిలుపునిచ్చారు.. పార్టీ అధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో గురువారం తెలంగాణ రక్షణ సేన (TRS )పార్టీ స్టేట్ టీం సభ్యులు, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి సిడాం దయాకర్‌తో కలిసి శ్రీ రాథోడ్ బాపురావు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, ప్రాంగణం అనుకూలత, ప్రజలకు కల్పించాల్సిన సౌకర్యాలపై నాయకులు చర్చించారు.

సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు*. అక్టోబర్ 30న జరిగే పాంచజన్య సభకు పార్టీ* నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా గ్రామాలు, మండలాల వారీగా సమన్వయంతో కార్యక్రమాలను చేపట్టాలని పేర్కొన్నారు.

సభ విజయవంతానికి ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

Annijula Srinivas Rao, Staff Reporter -Adilabad

మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో, ఆదిలాబాద్ జిల్లా రాజకీయ, సామాజిక మరియు గిరిజన ప్రాంతాల పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.