Ichoda: అక్రమ వడ్డీ వ్యాపారం: నిందితుడిని అరెస్ట్
Ichoda: ఇచ్చోడ మండలం సిరిచెల్మ ఎక్స్ రోడ్ వద్ద సీఎస్‌పీ కేంద్రం ముసుగులో అక్రమంగా అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న అడే కైలాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Ichoda: అక్రమ వడ్డీ వ్యాపారం: నిందితుడిని అరెస్ట్
ఇచ్చోడ: కస్టమర్ సర్వీస్ పాయింట్ (CSP) కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా అధిక వడ్డీకి అప్పులు ఇస్తున్న వ్యక్తిని ఇచ్చోడ పోలీసులు అరెస్ట్ చేశారు. మండలంలోని సిరిచెల్మ ఎక్స్ రోడ్ వద్ద ఎస్‌బీఐ సమీపంలో సేవా కేంద్రం నడుపుతున్న జల్దా గ్రామానికి చెందిన అడే కైలాష్ (36), ఎలాంటి అనుమతులు లేకుండా అమాయక ప్రజలకు అధిక వడ్డీకి అప్పులిస్తూ మోసగిస్తున్నట్లు విచారణలో తేలింది.
నిందితుడు నకిలీ రబ్బరు ముద్రను కూడా వినియోగిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు, అతనిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఖాళీ చెక్కు, బ్యాంకు పాస్ పుస్తకం, డిపాజిట్ రశీదులు, నకిలీ రబ్బరు ముద్రను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేని వ్యక్తుల వద్ద అధిక వడ్డీకి అప్పులు తీసుకుని మోసపోవద్దని ఇచ్చోడ ఎస్‌హెచ్‌ఓ బి. ప్రవీణ్ కుమార్ ప్రజలను హెచ్చరించారు.




