Ichoda: తాను చదువుకున్న బడిని ఆధునీకరిస్తా.. ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Ichoda: ఇచ్చోడ మండల కేంద్రంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటించి రూ.7 కోట్లతో నిర్మించనున్న డిగ్రీ కళాశాల, జడ్పీఎస్ఎస్ పాఠశాల స్థలాలను పరిశీలించారు.

NAGULA SATISH, BOATH
Published on: 23 Nov 2026 5:41 PM IST
Ichoda
X

Ichoda: తాను చదువుకున్న బడిని ఆధునీకరిస్తా: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

ఇచోడ: బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోమవారం ఇచ్చోడ మండల కేంద్రంలో పర్యటించి పలు అభివృద్ధి పనులను అధికారులతో కలిసి సమీక్షించారు. ప్రధాన రహదారిపై కొనసాగుతున్న డివైడర్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతో పట్టణానికి కొత్త అందాలు తీసుకొస్తామని తెలిపారు. పట్టణంలోని అన్ని కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణాన్ని వేగంగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు.

​అనంతరం రూ.2 కోట్లతో నిర్మించనున్న డిగ్రీ కళాశాల, రూ.5 కోట్లతో నిర్మించనున్న జడ్పీఎస్ఎస్ పాఠశాల నూతన భవనాల స్థలాలను పరిశీలించారు. భవిష్యత్తులో డిగ్రీ కళాశాలను పీజీ స్థాయికి అప్‌గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

తాను చదువుకున్న పాఠశాలను అన్ని ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతానని పేర్కొంటూ, విద్యార్థులకు ఎలాంటి సమస్యలున్నా నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి నాణ్యమైన ఆహారం అందించాలని ఉపాధ్యాయులకు సూచించిన ఆయన, ఇచ్చోడను అన్ని రంగాల్లో ఆదర్శ పట్టణంగా మారుస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

NAGULA SATISH, BOATH

NAGULA SATISH, BOATH