Nirmal: దస్తురాబాద్‌లో రూ.99కే కిలో చికెన్.. ఎగబడ్డ మాంస ప్రియులు!

Nirmal: నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల కేంద్రంలోని భారత్ చికెన్ సెంటర్‌లో గురువారం కిలో చికెన్ రూ.99కే విక్రయించడంతో మాంస ప్రియులు భారీగా తరలివచ్చారు.

RAKESH N, KHANAPUR
Published on: 19 Nov 2026 1:29 PM IST
Nirmal
X

Nirmal: దస్తురాబాద్‌లో రూ.99కే కిలో చికెన్.. ఎగబడ్డ మాంస ప్రియులు!

Nirmal: నిర్మల్ జిల్లా// దస్తురాబాద్ మండల కేంద్రంలో కోడి కూర సందడి నెలకొంది. స్థానికంగా ఉన్న భారత్ చికెన్ సెంటర్ నిర్వాహకులు గురువారం ప్రత్యేక ఆఫర్ ప్రకటించారు. కేవలం 99 రూపాయలకే కిలో చికెన్ విక్రయించడంతో మాంస ప్రియులు భారీగా తరలివచ్చారు.

తక్కువ ధరకే చికెన్ లభిస్తుండటంతో ఉదయం నుండే దుకాణం ముందు జనం బారులు తీరారు. కిలోల కొద్దీ చికెన్ కొనుగోలు చేస్తూ సందడి చేశారు. ఈ బంపర్ ఆఫర్‌తో గురువారం నాడే దస్తురాబాద్ వాసులు ఎంచక్కా ఘుమఘుమలాడే కోడి కూర వండుకుని ఆరగించారు.

RAKESH N, KHANAPUR

RAKESH N, KHANAPUR