Nirmal: ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లే లక్ష్యం: అదనపు కలెక్టర్
Nirmal: దిలావర్పూర్ మండలం న్యూలోలంలో ‘మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ లబ్ధిదారులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు.
Nirmal: ఇండ్లు లేని నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లే లక్ష్యం: అదనపు కలెక్టర్
నిర్మల్ జిల్లా: దిలావర్పూర్ మండలం న్యూలోలం గ్రామంలో ఆదివారం నిర్వహించిన మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి కార్యక్రమంలో ఇన్చార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్ పాల్గొని ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడి గృహంలో దీపాలు వెలిగించి దీపావళి వేడుకలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంతింటిలో లబ్ధిదారులు దీపావళి పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అనేక ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, జిల్లాలోనూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు నిర్మించి అందించేలా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రతి పేదవాడి సొంతింటి కలను ప్రభుత్వం నిజం చేస్తోందని అన్నారు.
ఈ సందర్భంగా లబ్ధిదారు మాట్లాడుతూ, తమ ఇంట్లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు. సొంతింటి కలను సాకారం చేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్కు, సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అరుణారాణి, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, లబ్ధిదారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




